Загрузка страницы

నాన్నా-పులి నీతి కథ || Nanna Puli Telugu Moral Stories | 3D animated Chandamama Kathalu

నాన్నా-పులి నీతి కథ || Nanna Puli | Telugu Moral Stories | 3D animated Chandamama Kathalu

#నాన్నాపులినీతికథ #Telugumoralstories #bedtimestories

***************** నాన్నా - పులి! *********************

ఒక ఊరిలో ఒక గొర్రెల కాపరి వుండేవాడు. రోజూ అతను గొర్రెల మందను మేతకోసం దగ్గరలో వున్న అడవికి తోలుకుని వెళ్ళేవాడు. ఆ గొర్రెలు అక్కడ రోజంతా ఆకులు అలమలు తినేవి. వాటిని అలా మేతకు వదిలేసి , ఆ కాపరి మాత్రం బాగా అల్లరి చేసేవాడు. అందరినీ ఆట పట్టిస్తూ వుండేవాడు. ఏదో తెలియని వయసు కాబట్టి అల్లరి చేస్తున్నాడులే, రేపు పెద్ద అయ్యాకా మారకపోతాడా.. అని ఎవరూ ఏమీ అనేవారు కాదు.

అలా రోజులు గడిచేకొద్దీ ఆ కాపరి అల్లరి చేష్టలు కూడా ఎక్కువ కాసాగాయి..
ఓ నాడు ఎప్పటిలానే గొర్రెల మందను తోలుకుని కొండ ప్రాంతానికి వెళ్లాడు. కొండ దిగువన వాళ్ల నాన్నతో పాటు మరికొందరు కట్టెలు కొట్టకుంటూ కనపడ్డారు.. వాళ్లను చూడగానే..
" ఇవాళ ఎలాగైనా వాళ్లందరినీ బాగా ఏడిపించాలి. కానీ, ఏం చేసి వాళ్ళందరినీ బాగా ఆటపట్టించొచ్చు.." అని ఆలోచించ సాగాడు..
అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే మంచి- చెడు ఆలోచించకుండా గట్టిగా..
“నాన్నా.. పులి! నాన్నా.. పులి!” అని కేకలు వేయడం మొదలెట్టాడు.

కేకలు విని దూరంగా కట్టెలు కొట్టుకుంటున్న వాళ్ల నాన్నతో పాటు మిగిలిన వాళ్లు కర్రలు తీసుకుని కంగారుగా పరిగెత్తుకుంటూ కొండపైకి వచ్చారు. వచ్చి చూస్తే వారికి అక్కడ పులి కనిపించలేదు.
కంగారుగా వున్న వాళ్ళను చూడగానే ఆ కాపరికి బాగా నవ్వొచ్చింది.
" నాన్నా.. మీరంతా నా మాటను నమ్మేశారు...తూచ్.. తూచ్.." అంటూ పెద్దగా నవ్వసాగాడు. చిన్న పిల్లవాడు కనుక కొట్టకుండా అందరూ వాడిని కోపంగా చూసి తిట్టుకుంటూ వెళ్లిపోయారు.

ఇది ఆ కుర్రవాడికి చాలా సరదాగా అనిపించింది.. అందరు మళ్ళీ కట్టెలు కొట్టుకుంటూ బిజీగా వుండగా, మళ్ళీ గట్టిగా “ నాన్నా.. పులి! అమ్మో.. పులి! నిజంగా పులి..” అని అరుపులు మొదలెట్టాడు.
అది విని అందరూ ఒక్క క్షణం ఆలోచించినా.. "ఏమో! నిజమేనేమో " అని మళ్ళీ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి, కర్రలు తీసుకుని ఆతృతగా పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడికి పులి ఏదీ రాలేదని చూడగానే వారికి అర్దం అయ్యింది. ఈ సారి వాళ్ళకి చాలా కోపం వచ్చింది.
ఆ కాపరి మాత్రం "భలే భలే ... మళ్ళీ నా మాటని నమ్మి మోసపోయారు.. తూచ్..తూచ్.." అని పడీ పడీ నవ్వసాగాడు.
" ఒరేయ్ అబ్బాయ్ .. ఇది నీకు మంచిదికాదు.. ప్రతీసారీ నీ అరుపులు విని మేం పనులు వదులుకుని వస్తున్నాం.. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు చేస్తే ఈ సారి నాలుగు తగలనిస్తాను" అని వాళ్ళ నాన్న అబ్బాయిని బాగా తిట్టాడు. మళ్ళీ ఇలా చేయొద్దని మిగిలిన వాళ్ళు మందలించి వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళ కోపం చూసి మళ్ళీ ఇలా చేయకూడదని కాపరి అనుకున్నాడు.

అయితే, కొంత సేపటికి నిజంగానే గొర్రెల మంద దగ్గరకి పులి వచ్చింది. ఆ కుర్రవాడు చాల భయపడ్డాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా దగ్గర్లో వున్న చెట్టుపైకి వేగంగా ఎక్కి పులికి అందకుండా కూర్చున్నాడు.
మళ్ళీ గట్టిగా “నాన్నా.. పులి! నాన్నా.. పులి! నిజంగానే పులి వచ్చింది .. కాపాడండి.. కాపాడండి” అని అరవసాగాడు.

ఆ అరుపులు విని కొండ కింద పనులు చేసుకుంటున్న వాళ్ళంతా, మళ్ళీ ఊరికే ఆటపట్టించడానికే అరుస్తున్నాడు అనుకున్నారు. ఈ సారి ఎవ్వరూ సహాయం చేయడానికి రాలేదు. ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటూ ఆ కాపరిని పట్టించుకోలేదు.
పులి వేటాడి ఒక గొర్రెను చంపేసింది. దాన్ని నోట కరుచుకుని తీసుకుని వెళ్లి పోయింది.
భయంతో ఆ అబ్బాయి చెట్టు మీదే ఉన్నాడు. ఆకలి, దాహం అన్ని మరిచిపోయి రోజంతా ఏడుస్తూ గడిపాడు.

సాయంకాలం అయినా కొడుకు ఎంతకీ రాకపోవడంతో తండ్రి వెతుక్కుంటూ కొండపైకి వచ్చాడు. తండ్రి కనపడగానే ఆ అబ్బాయి చెట్టు మీంచి దిగి జరిగినది అంతా చెప్పాడు.
“ఎంత పిలిచినా ఎవ్వరు రాలేదు! చాలా భయమేసింది నాన్నా!” అని ఏడ్చాడు.
పులి ఒక గొర్రెను ఎత్తుకుపోయినందుకు మొదట బాధపడినా, తర్వాత కొడుకు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ తండ్రి ..
“ఒక్కసారి నువ్వు అబద్ధాలు ఆడతావని అందరూ భావిస్తే, తరువాత నువ్వు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు” అని చెప్పాడు.
ఆ రోజు తరువాత ఆ అబ్బాయి ఎప్పుడూ అబద్ధాలు ఆడలేదు.

ఈ కథలో నీతి ఏమిటంటే .. "ఎల్లప్పుడూ నిజాలే చెప్పాలి."

Видео నాన్నా-పులి నీతి కథ || Nanna Puli Telugu Moral Stories | 3D animated Chandamama Kathalu канала Chulbul Gamer
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
31 декабря 2019 г. 15:48:27
00:13:28
Другие видео канала
దెయ్యాల దీవి || Episode 1 Telugu Horror Entertainment  @chulbulgameదెయ్యాల దీవి || Episode 1 Telugu Horror Entertainment @chulbulgameఉంగరం దయ్యం కి లడ్డు గుడ్డు బలి || Telugu Horror Entertainment Short 3 @chulbulgameఉంగరం దయ్యం కి లడ్డు గుడ్డు బలి || Telugu Horror Entertainment Short 3 @chulbulgameఉంగరం దయ్యం కి లడ్డు గుడ్డు బలి || Telugu Horror Entertainment  Short 2  @chulbulgameఉంగరం దయ్యం కి లడ్డు గుడ్డు బలి || Telugu Horror Entertainment Short 2 @chulbulgameఉంగరం దయ్యం కి లడ్డు గుడ్డు బలి || Telugu Horror Entertainment Short 1 @chulbulgameఉంగరం దయ్యం కి లడ్డు గుడ్డు బలి || Telugu Horror Entertainment Short 1 @chulbulgameఉంగరం దయ్యం కి లడ్డు గుడ్డు బలి || Telugu Horror Entertainment @chulbulgameఉంగరం దయ్యం కి లడ్డు గుడ్డు బలి || Telugu Horror Entertainment @chulbulgameరెండు కుండల కథ || The story of the two pots Telugu moral story || 3D animated fairy talesరెండు కుండల కథ || The story of the two pots Telugu moral story || 3D animated fairy talesరెండు కుండల కథరెండు కుండల కథఅడవికి రాజైన నీలి నక్కఅడవికి రాజైన నీలి నక్కరహస్యంరహస్యంअच्छा तोता और चोर तोता नैतिक कहानी || Accha Thota Aur Chor Thota Hindi Moral Story @chulbulgameअच्छा तोता और चोर तोता नैतिक कहानी || Accha Thota Aur Chor Thota Hindi Moral Story @chulbulgameबुद्धिमान हिरन नैतिक कहानी || Clever Deer Moral Story In Hindi || @chulbulgameबुद्धिमान हिरन नैतिक कहानी || Clever Deer Moral Story In Hindi || @chulbulgameचूहों ने बिल्ली को किया सलमान || Choohon Ne Billee Ko Kiya Salamaan Short ||  @chulbul1 ​चूहों ने बिल्ली को किया सलमान || Choohon Ne Billee Ko Kiya Salamaan Short || @chulbul1 ​शेर और भाग की लड़ाई || Sher Aur Bhag Ki Ladayi Short In Hindi || ​शेर और भाग की लड़ाई || Sher Aur Bhag Ki Ladayi Short In Hindi || ​छोटी सी चीटी का साहस || Choti Si Chiti Ka Sahas Short ||  @chulbulgameछोटी सी चीटी का साहस || Choti Si Chiti Ka Sahas Short || @chulbulgameछोटी सी चीटी का साहस नैतिक कहानी || Choti Si Chiti Ka Sahas Moral Story ||  @chulbul1छोटी सी चीटी का साहस नैतिक कहानी || Choti Si Chiti Ka Sahas Moral Story || @chulbul1बन्दर का जाप || Bandar ka jaap || #shorts || @chulbulgameबन्दर का जाप || Bandar ka jaap || #shorts || @chulbulgameबन्दर का जाप नैतिक कहानी || Bandar ka jaap Moral Story In Hindi @chulbulgameबन्दर का जाप नैतिक कहानी || Bandar ka jaap Moral Story In Hindi @chulbulgameबेचारी हंस || Bechari Hans  Short In Hindi || @chulbulgameबेचारी हंस || Bechari Hans Short In Hindi || @chulbulgameबेचारी हंस नैतिक कहानी || Bechari Hans Hindi Moral Story @chulbulgameबेचारी हंस नैतिक कहानी || Bechari Hans Hindi Moral Story @chulbulgameबुद्धि से काम लो || Buddhi Se Khaam Lo Shoet In Hindi @chulbulgameबुद्धि से काम लो || Buddhi Se Khaam Lo Shoet In Hindi @chulbulgameबुद्धि से काम लो मोरल कहानी || Buddhi Se Khaam Lo Moral Story In Hindi @chulbulgameबुद्धि से काम लो मोरल कहानी || Buddhi Se Khaam Lo Moral Story In Hindi @chulbulgame
Яндекс.Метрика