Загрузка страницы

రహస్యం

**************** రహస్యం ******************

ఒక ఊరిలో రాము, సోము అనే ఇద్దరు మిత్రులు వుండేవారు. ఆ ఇద్దరు మొక్క జొన్న సాగు చేసేవారు. ఆ ఏడు పంట అయితే ఏపుగా పెరిగింది కానీ, వాటికి జొన్న కంకులు కాయలేదు. దాంతో వ్యవసాయంలో నష్టం వచ్చింది. ఇక రాము, సోములు ఆ ఊరిలో వుండి లాభం లేదనీ.. జీవనోపాధి కోసం పొరుగూరికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు. పొరుగు ఊరికి వెళ్లాలంటే మధ్య దారిలో ఒక అడవి వస్తుంది. దట్టమైన ఆ అడవి దాటితేకాని పొరుగూరికి చేరలేరు. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉంటాయని వారికి తెలుసు. అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసి కట్టుగా ఎదిరించాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్న ప్రకారం మ‌ర్నాడు పొరుగూరికి బయలుదేరారు రాము, సోము. అలాగే అడవిలోకి ప్రవేశించారు. గట్టిగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడవసాగారు.. అలా కొంత దూరం నడిచిన వారికి హఠాత్తుగా దూరంలో ఒక ఎలుగుబంటి కనిపించింది. వెంటనే ఇద్దరూ మరింత భయపడిపోయారు.
“ఏం చేద్దాం?” అన్నాడు రాము.
"వేగంగా పారిపోదాం.." అన్నాడు సోము.
"మనల్ని వెంబడించి మరీ పట్టుకుంటుందీ.."
“అయితే, చెట్టు ఎక్కేద్దాము..”
“కాని నాకు చెట్టు ఎక్కడం రాదే! ఇద్దరం కలిసి దాన్ని ఎదిరిద్దాం..”
“నాకు చెట్టు ఎక్కడం వచ్చు కదా, నీ దారి నీవు చూసుకో..” అని సోము చేయి వదిలించుకుని గబ గబా పక్కనున్న చెట్టు ఎక్కేసాడు.
రాముకి చెట్టు ఎక్కడం రాదు కదా! ఏం చేస్తాడు? తన మిత్రుడేమో ఇలాంటి పరిస్థితిలో వంటరిగా వదిలేసాడు!
తన వైపుకే వస్తున్న ఎలుగు బంటిని చూసి వెంటనే నేల మీద చడీ చప్పుడు చేయకుండా శవంలా పడుకున్నాడు.
ఎలుగుబంటి రాము దగ్గరకు వచ్చింది. పాపం, ఊపిరి కూడా బిగబట్టి అలాగే ఏమాత్రం కదలకుండా పడుకున్నాడు. అతని ముఖానికి దగ్గరకు వచ్చి వాసన చూసి కొంతసేపు పరీక్షించింది.. అతడు చనిపోయాడనుకుంది.. ఎలుగుబంటి చనిపోయిన జీవులను తినదు. అందుకే చివరికి అతన్ని వదిలి వెళ్ళిపోయింది.
ఎలుగుబంటి వెళ్ళిపోయాక రాము నెమ్మదిగా లేచాడు. "హమ్మయ్య! " అని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు.
సోము కూడా చెట్టు మీంచి దిగాడు. ఎలుగుబంటి రాముకి దగ్గరగా వచ్చి వాసన చూసినప్పుడు అతని చెవిలో ఏదో రహస్యం చెప్పిందనుకుని అపోహపడ్డాడు.
“ఎలుగుబంటి నీకు అంతసేపు చెవిలో ఏమి చెప్పింది రా..” అని అడిగాడు.
“అవసరానికి ఆదుకోని వాళ్ళు స్నేహితులే కారు, అని నాతో ఎలుగుబంటి చెప్పింది” అని రాము జవాబిచ్చి తన దారి తాను చూసుకున్నాడు.
ఈ కథలో నీతి ఏమిటంటే.. "క‌ష్ట‌ సుఖాల్లో తోడుండేవాడే నిజ‌మైన స్నేహితుడ‌ు...."

Видео రహస్యం канала Trending Stories
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
13 октября 2023 г. 15:40:43
00:10:59
Другие видео канала
🔴LIVE :  Chanakya neethi katha || Deer and Hunter Lion Story in Telugu🔴LIVE : Chanakya neethi katha || Deer and Hunter Lion Story in Telugu🔴LIVE : మాయా గుర్రం తెలుగు నీతి కథ || Magical Horse Amazing Moral Story🔴LIVE : మాయా గుర్రం తెలుగు నీతి కథ || Magical Horse Amazing Moral StoryBakri Ke Bachee Ke Musibathein Moral Story In Hindi @Trendingstories123Bakri Ke Bachee Ke Musibathein Moral Story In Hindi @Trendingstories123मायावी घोड़ा हिंदी कहानी || Magical horse and monster hindi story @Trendingstories123मायावी घोड़ा हिंदी कहानी || Magical horse and monster hindi story @Trendingstories123Budhiman gadha Hindi shorts @Trendingstories123Budhiman gadha Hindi shorts @Trendingstories123Mad monkey Hindi Video || Animals and Monkey comedy video @Trendingstories123Mad monkey Hindi Video || Animals and Monkey comedy video @Trendingstories123बेचारी हंस नैतिक कहानी || Bechari Hans Hindi Moral Story @Trendingstories123बेचारी हंस नैतिक कहानी || Bechari Hans Hindi Moral Story @Trendingstories123🔴LIVE : బావిలో నక్క - జింక నీతి కథ || Intelligent Fox and Deer Telugu Moral Stories🔴LIVE : బావిలో నక్క - జింక నీతి కథ || Intelligent Fox and Deer Telugu Moral Storiesछोटी सी चीटी का साहस || Choti Si Chiti Ka Sahas Short ||  @Trendingstories123छोटी सी चीटी का साहस || Choti Si Chiti Ka Sahas Short || @Trendingstories123गदा और कुट्टा नैतिक कहानी || Moral Story In Hindi @Trendingstories123गदा और कुट्टा नैतिक कहानी || Moral Story In Hindi @Trendingstories123🔴LIVE : పులి మరియు నక్కలు తెలుగు కథ || Tiger and Foxes Telugu story🔴LIVE : పులి మరియు నక్కలు తెలుగు కథ || Tiger and Foxes Telugu storyचालाक लोमड़ी || Chalaak Lomdi Short In Hindi @Trendingstories123चालाक लोमड़ी || Chalaak Lomdi Short In Hindi @Trendingstories123Monster vs Hulk man Temple run Game in real life || Monster real life game @Trendingstories123Monster vs Hulk man Temple run Game in real life || Monster real life game @Trendingstories123अनोखा जनवर  || Anokha janwar Hindi Short @Trendingstories123अनोखा जनवर || Anokha janwar Hindi Short @Trendingstories123ధర్మయ్య చెప్పిన తీర్పు  || Dharmaiah 's Verdict - Moral stories - Moral story@Trendingstories123ధర్మయ్య చెప్పిన తీర్పు || Dharmaiah 's Verdict - Moral stories - Moral story@Trendingstories123🔴LIVE : జాలరిని భయపెట్టిన చేప తెలుగు నీతి కథ || Fisher man and Fishes Grandma Stories🔴LIVE : జాలరిని భయపెట్టిన చేప తెలుగు నీతి కథ || Fisher man and Fishes Grandma Storiesछोटी सी चीटी का साहस नैतिक कहानी || Choti Si Chiti Ka Sahas Moral Story ||  @chulbul1छोटी सी चीटी का साहस नैतिक कहानी || Choti Si Chiti Ka Sahas Moral Story || @chulbul1రాములు సహనం నీతి కథ || TELUGU STORY - MORAL STORY - STORIES IN TELUGU @Trendingstories123రాములు సహనం నీతి కథ || TELUGU STORY - MORAL STORY - STORIES IN TELUGU @Trendingstories123Bhedhiye Ko Sabak Sikhane Walle Bakhriya Moral Story In Hindi @Trendingstories123Bhedhiye Ko Sabak Sikhane Walle Bakhriya Moral Story In Hindi @Trendingstories123Haathi ne ki gorilla ki madad Hindi Story @Trendingstories123Haathi ne ki gorilla ki madad Hindi Story @Trendingstories123मेंढक के शक्ति समर्थ हिन्दी कहानियाँ || Frog and Rabbit animal stories in Hindiमेंढक के शक्ति समर्थ हिन्दी कहानियाँ || Frog and Rabbit animal stories in Hindi
Яндекс.Метрика