Загрузка страницы

రెండు కుండల కథ

....రెండు కుండల కథ...

ఒక ఊరిలో నీళ్ళు మోసే పనివాడొకడుండేవాడు. అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్ళు మోసుకొచ్చేవాడు. ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారి పోతుంటే, మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది.

చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేది. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండ గర్వంతో పొంగిపోయేది.

" చూడు.. చూడూ.. నేను సంపూర్ణ ఆరోగ్యంగా వున్నాను.. నీవు అనారోగ్యంతో మంచాన పడ్డావు.. నీవు నాకు జోడీనే కాదు.. నీలాంటి వాళ్ళను యజమాని మాత్రం ఎంతకాలం భరిస్తాడు.. తొందరలోనే నీవు మట్టిలో కలిసిపోతావు.." అని తరచూ వెక్కిరించేది.

దాంతో పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఓ రోజు పగుళ్ళు గల కుండ పనివాడితో "నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు" అంది.

" నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు?" అడిగాడు పనివాడు.
"ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నావల్ల నీకు అదనపు పని అవుతుంది. నీకష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు" అని బాధపడిందా పగుళ్ళ కుండ.
దాని బాధను అర్ధం చేసుకున్న పనివాడు "బాధపడకు, ఈ రోజు చెరువునుండి యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు" అన్నాడు.
కుతూహలంగా ఆ పగుళ్ళ కుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది.

పనివాడు ఆ కుండతో "కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి. మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా ఎందుకు చేస్తానో తెలుసా...? నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే, నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. నువ్వు పగుళ్ళతో లేకపోతే యజమాని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండేవికావు" అన్నాడు.
పగుళ్ళ కుండ తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది.
తన భాధను అర్ధం చేసుకోవడమే కాకుండా, తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది.
ఈ కథలో నీతి ఏమిటంటే... "లోపాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న వారికే సంతోషం దక్కుతుంది. "

Видео రెండు కుండల కథ канала Trending Stories
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
13 октября 2023 г. 15:44:05
00:13:20
Другие видео канала
🔴LIVE :  Chanakya neethi katha || Deer and Hunter Lion Story in Telugu🔴LIVE : Chanakya neethi katha || Deer and Hunter Lion Story in TeluguBudhiman gadha Hindi shorts @Trendingstories123Budhiman gadha Hindi shorts @Trendingstories123Mad monkey Hindi Video || Animals and Monkey comedy video @Trendingstories123Mad monkey Hindi Video || Animals and Monkey comedy video @Trendingstories123बेचारी हंस नैतिक कहानी || Bechari Hans Hindi Moral Story @Trendingstories123बेचारी हंस नैतिक कहानी || Bechari Hans Hindi Moral Story @Trendingstories123🔴LIVE : బావిలో నక్క - జింక నీతి కథ || Intelligent Fox and Deer Telugu Moral Stories🔴LIVE : బావిలో నక్క - జింక నీతి కథ || Intelligent Fox and Deer Telugu Moral Storiesछोटी सी चीटी का साहस || Choti Si Chiti Ka Sahas Short ||  @Trendingstories123छोटी सी चीटी का साहस || Choti Si Chiti Ka Sahas Short || @Trendingstories123🔴LIVE :  తెలివితక్కువ పిల్లులు మరియు తెలివైన కోతి  నీతి క‌థ‌ || Foolish Cats and Clever Monkey Story🔴LIVE : తెలివితక్కువ పిల్లులు మరియు తెలివైన కోతి నీతి క‌థ‌ || Foolish Cats and Clever Monkey Storyटोकरी में चिड़िया नैतिक कहानी || Tokhri Mein Chidiya Moral Story In Hindi @Trendingstories123टोकरी में चिड़िया नैतिक कहानी || Tokhri Mein Chidiya Moral Story In Hindi @Trendingstories123🔴LIVE : దొంగలకు బుద్ది చెప్పిన మంచి దెయ్యం - 02 || Ghost and thieves - 02 Telugu moral stories🔴LIVE : దొంగలకు బుద్ది చెప్పిన మంచి దెయ్యం - 02 || Ghost and thieves - 02 Telugu moral storiesगदा और कुट्टा नैतिक कहानी || Moral Story In Hindi @Trendingstories123गदा और कुट्टा नैतिक कहानी || Moral Story In Hindi @Trendingstories123🔴LIVE : పులి మరియు నక్కలు తెలుగు కథ || Tiger and Foxes Telugu story🔴LIVE : పులి మరియు నక్కలు తెలుగు కథ || Tiger and Foxes Telugu storyचालाक लोमड़ी || Chalaak Lomdi Short In Hindi @Trendingstories123चालाक लोमड़ी || Chalaak Lomdi Short In Hindi @Trendingstories123Monster vs Hulk man Temple run Game in real life || Monster real life game @Trendingstories123Monster vs Hulk man Temple run Game in real life || Monster real life game @Trendingstories123अनोखा जनवर  || Anokha janwar Hindi Short @Trendingstories123अनोखा जनवर || Anokha janwar Hindi Short @Trendingstories123ధర్మయ్య చెప్పిన తీర్పు  || Dharmaiah 's Verdict - Moral stories - Moral story@Trendingstories123ధర్మయ్య చెప్పిన తీర్పు || Dharmaiah 's Verdict - Moral stories - Moral story@Trendingstories123बुद्धि से काम लो मोरल कहानी || Buddhi Se Khaam Lo Moral Story In Hindi @Trendingstories123बुद्धि से काम लो मोरल कहानी || Buddhi Se Khaam Lo Moral Story In Hindi @Trendingstories123🔴LIVE : జాలరిని భయపెట్టిన చేప తెలుగు నీతి కథ || Fisher man and Fishes Grandma Stories🔴LIVE : జాలరిని భయపెట్టిన చేప తెలుగు నీతి కథ || Fisher man and Fishes Grandma Storiesछोटी सी चीटी का साहस नैतिक कहानी || Choti Si Chiti Ka Sahas Moral Story ||  @chulbul1छोटी सी चीटी का साहस नैतिक कहानी || Choti Si Chiti Ka Sahas Moral Story || @chulbul1🔴LIVE :  దుప్పి కష్టాలు || Single Eye Deer Telugu Moral Story || Panchatantra Moral Stories🔴LIVE : దుప్పి కష్టాలు || Single Eye Deer Telugu Moral Story || Panchatantra Moral Storiesరాములు సహనం నీతి కథ || TELUGU STORY - MORAL STORY - STORIES IN TELUGU @Trendingstories123రాములు సహనం నీతి కథ || TELUGU STORY - MORAL STORY - STORIES IN TELUGU @Trendingstories123🔴LIVE : గుండు దెయ్యం - ౦2 కామెడీ హారర్ వీడియో || Gundu deyyam telugu horror video by Bamma Kathalu🔴LIVE : గుండు దెయ్యం - ౦2 కామెడీ హారర్ వీడియో || Gundu deyyam telugu horror video by Bamma Kathalu
Яндекс.Метрика