Загрузка страницы

అడవికి రాజైన నీలి నక్క || Blue Fox and Animals Telugu Moral Stories

#moralstories #neethikathalu #moral

************ అడవికి రాజైన నీలి నక్క *******************
అనగనగా ఓ అడవిలో ఓ నక్క వుండేది. అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది. అన్నీ అడవిలోనే వుంటూ వేటి పని అవి చూసుకుంటూవుంటే ..ఈ నక్క మాత్రం అప్పుడప్పుడూ ఆ అడవికి ఆనుకునివున్న ఊళ్ళోకి వెళ్ళి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది.
అలా ఓరోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూసాయి. కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క "అమ్మో! ఈ ఊరకుక్కలకు దొరికానో పిక్కను పీక్కుతింటాయి. ఎలాగోలా వీటినుంచి తప్పించుకోవాలి" అని పరుగు తీసింది.

అలా పరుగుపెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీలి రంగు వేసే తొట్టె కనిపిస్తే అమాంతం అందులోకి దూకి దాక్కుంది. అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కన్పించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి. తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలి రంగు అంటుకుని, అదొక వింత జీవిలా మారిపోయింది.

మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంటబడతాయోనని వేగంగా అడవిలోకి పరుగెత్తింది. అడవిలోని ఇతర జంతువులు అన్నీ కూడా నీలం రంగులో వింతగా కనబడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హఢలిపోయాయి.
"అదేదో విచిత్రమైన జంతువు ఇటే వస్తుంది.. అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో.. పారిపోండి... పారిపోండి.." అంటూ ఏనుగు అరవడంతో అన్నీ తలో దిక్కు పరుగులు తీసాయి. తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయింగా అనిపించింది.

తర్వాత పరుగెత్తి ..పరుగెత్తి వుండటం వల్ల దాహం వేయడంతో ఒక కొలను వద్దకు వెళ్ళి నీరు త్రాగుతుండగా ..నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కిపడింది.
"ఓహో ! ఈ కారణంగానా నా మిత్రులంతా నన్ను చూసి భయపడిపారిపోతున్నారు. వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం.." అనుకుంది నక్క .

అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి. " అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది. దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా.." అంది కోతి.
"అదే నేనూ ఆలోచిస్తున్నాను.. ఆ వచ్చింది ఎవరో ..దాని బలం, బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బయిపోతాం.."అని సింహం అనగానే...
" సింహం నిజం చెప్పింది.. నన్ను తక్కువగా అంచనా వేయెద్దు" అంటూ గంభీరంగా పెద్ద బండమీదకి వస్తున్న నీలి నక్కని చూసి అన్నీ పారిపోబోయాయి.
"ఆగండి.. ఎవరూ భయపడొద్దు..నేను చెప్పేది వినండి."
అన్నీ ఎక్కడివి అక్కడే స్థంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి.

"ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించింది. నేను మీ రక్షకుడిని. ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి. "అని తన గురించి గొప్పలు చెప్పుకుంది నక్క.
నక్క చెప్పినది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తర్వాతే అవి ఆరగించేవి. ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది.

అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊళలేయడం ప్రారంభించాయి. ఆ అరుపులు విన్న నీలి రంగు నక్క కూడా ఉత్సాహంగా ఊళవెయ్యడం మొదలెట్టింది. ఊళవెయ్యడం నక్కల సహజ లక్షణం. అనుమానం రావడంతో ఏనుగు తొండంతో నీళ్ళను నక్కపై కుమ్మరిచింది. దాంతో నీలిరంగు పోయి, నక్క నిజ స్వరూపం బయటపడింది.

జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి. సింహం కోపంగా "ఇంతకాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు ..బుద్ది చెప్పండీ." అనడంతో పారిపోబోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి.

ఈ కథలో నీతి ఏమిటంటే. "అబద్దాలను ఎక్కువ కాలం దాచివుంచలేము.."

Видео అడవికి రాజైన నీలి నక్క || Blue Fox and Animals Telugu Moral Stories канала Trending Stories
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
13 октября 2023 г. 15:44:08
00:10:37
Другие видео канала
🔴LIVE :  Chanakya neethi katha || Deer and Hunter Lion Story in Telugu🔴LIVE : Chanakya neethi katha || Deer and Hunter Lion Story in TeluguBakri Ke Bachee Ke Musibathein Moral Story In Hindi @Trendingstories123Bakri Ke Bachee Ke Musibathein Moral Story In Hindi @Trendingstories123Budhiman gadha Hindi shorts @Trendingstories123Budhiman gadha Hindi shorts @Trendingstories123Mad monkey Hindi Video || Animals and Monkey comedy video @Trendingstories123Mad monkey Hindi Video || Animals and Monkey comedy video @Trendingstories123बेचारी हंस नैतिक कहानी || Bechari Hans Hindi Moral Story @Trendingstories123बेचारी हंस नैतिक कहानी || Bechari Hans Hindi Moral Story @Trendingstories123Godzilla Aur King Kong Ki Ladayi In Hindi || Cartoon Gorilla and amazing video@Trendingstories123Godzilla Aur King Kong Ki Ladayi In Hindi || Cartoon Gorilla and amazing video@Trendingstories123🔴LIVE : బావిలో నక్క - జింక నీతి కథ || Intelligent Fox and Deer Telugu Moral Stories🔴LIVE : బావిలో నక్క - జింక నీతి కథ || Intelligent Fox and Deer Telugu Moral Storiesछोटी सी चीटी का साहस || Choti Si Chiti Ka Sahas Short ||  @Trendingstories123छोटी सी चीटी का साहस || Choti Si Chiti Ka Sahas Short || @Trendingstories123🔴LIVE :  తెలివితక్కువ పిల్లులు మరియు తెలివైన కోతి  నీతి క‌థ‌ || Foolish Cats and Clever Monkey Story🔴LIVE : తెలివితక్కువ పిల్లులు మరియు తెలివైన కోతి నీతి క‌థ‌ || Foolish Cats and Clever Monkey Storyअंगूठी चोर नैतिक कहानी || Ring Thief Moral Story In Hindi @Trendingstories123अंगूठी चोर नैतिक कहानी || Ring Thief Moral Story In Hindi @Trendingstories123टोकरी में चिड़िया नैतिक कहानी || Tokhri Mein Chidiya Moral Story In Hindi @Trendingstories123टोकरी में चिड़िया नैतिक कहानी || Tokhri Mein Chidiya Moral Story In Hindi @Trendingstories123🔴LIVE : దొంగలకు బుద్ది చెప్పిన మంచి దెయ్యం - 02 || Ghost and thieves - 02 Telugu moral stories🔴LIVE : దొంగలకు బుద్ది చెప్పిన మంచి దెయ్యం - 02 || Ghost and thieves - 02 Telugu moral storiesगदा और कुट्टा नैतिक कहानी || Moral Story In Hindi @Trendingstories123गदा और कुट्टा नैतिक कहानी || Moral Story In Hindi @Trendingstories123🔴LIVE : పులి మరియు నక్కలు తెలుగు కథ || Tiger and Foxes Telugu story🔴LIVE : పులి మరియు నక్కలు తెలుగు కథ || Tiger and Foxes Telugu storyचालाक लोमड़ी || Chalaak Lomdi Short In Hindi @Trendingstories123चालाक लोमड़ी || Chalaak Lomdi Short In Hindi @Trendingstories123Monster vs Hulk man Temple run Game in real life || Monster real life game @Trendingstories123Monster vs Hulk man Temple run Game in real life || Monster real life game @Trendingstories123अनोखा जनवर  || Anokha janwar Hindi Short @Trendingstories123अनोखा जनवर || Anokha janwar Hindi Short @Trendingstories123ధర్మయ్య చెప్పిన తీర్పు  || Dharmaiah 's Verdict - Moral stories - Moral story@Trendingstories123ధర్మయ్య చెప్పిన తీర్పు || Dharmaiah 's Verdict - Moral stories - Moral story@Trendingstories123बुद्धि से काम लो मोरल कहानी || Buddhi Se Khaam Lo Moral Story In Hindi @Trendingstories123बुद्धि से काम लो मोरल कहानी || Buddhi Se Khaam Lo Moral Story In Hindi @Trendingstories123छोटी सी चीटी का साहस नैतिक कहानी || Choti Si Chiti Ka Sahas Moral Story ||  @chulbul1छोटी सी चीटी का साहस नैतिक कहानी || Choti Si Chiti Ka Sahas Moral Story || @chulbul1Haathi ne ki gorilla ki madad Hindi Story @Trendingstories123Haathi ne ki gorilla ki madad Hindi Story @Trendingstories123
Яндекс.Метрика