Загрузка страницы

Telangana | MEIL to Supply Medical Oxygen Cylinders Free of Cost to Hospitals

కొవిడ్ రోగులకు అవసరమైన ప్రాణవాయువు అందించేందుకు..... నిర్మాణ రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్ సంసిద్ధత వ్యక్తంచేసింది. భద్రాచలంలోని ఐటీసీ పేపర్ మిల్ లో రోజుకు 30 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ద్రవీకృత ఆక్సిజన్ ప్లాంట్ ను... మేఘా సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఆ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను తమ సంస్థల్లో ద్రవీకృత మెడికల్ ఆక్సిజన్ గా మార్చనున్నట్లు ప్రకటించింది. ఇంతేకాకుండా... బి టైప్ ఆక్సిజన్ సిలెండర్లను ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వానికి మేఘా ఇంజనీరింగ్ ప్రతిపాదన సమర్పించింది. రోజుకు 7 వేల లీటర్ల సామర్థ్యం గల 500నుంచి 600 ఆక్సిజన్ సిలెండర్లను అందిస్తామని పేర్కొంది. ఇప్పటికే....... నిమ్స్ , సరోజిని దేవీ కంటి ఆసుపత్రి, అపోలో, హైదారాబాద్ కేర్ హైటెక్ ఆసుపత్రుల నుంచి ఆక్సిజన్ నింపాల్సిందిగా...తమకు విజ్ఞాపనలు వచ్చినట్లు..... పేర్కొంది. స్పెయిన్ లో ఉన్న తమ సొంత యూనిట్ నుంచి 10 నుంచి 15 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మేఘా సంస్థ తెలిపింది.వాటి ద్వారా రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాచేయవచ్చని వివరించింది.

#LatestNews
#EtvTelangana

Видео Telangana | MEIL to Supply Medical Oxygen Cylinders Free of Cost to Hospitals канала ETV Telangana
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
8 мая 2021 г. 20:42:52
00:00:58
Яндекс.Метрика