Загрузка страницы

ఎవరికీ డబ్బులు కట్టకండి ..! ఫేక్ జాబ్స్, ఫేక్ యాడ్స్ | Online Scam..! Fraud Alert..! Fake Jobs

ఎవరికీ డబ్బులు కట్టకండి ..! ఫేక్ జాబ్స్, ఫేక్ యాడ్స్ | Online Scam..! Fraud Alert..! Fake Jobs

👉 If you want a job immediately subscribe to the channel - https://bit.ly/36gAgaz
☑️Join us on Whatsapp to get the latest job updates- https://chat.whatsapp.com/JlSXTgpV5AC7qLru3ivbLG
☑️Join us on Telegram to get more job updates- https://t.me/lokaljobs

జాబ్స్ నోటిఫికేషన్స్‌తో జాగ్రత్త..!

జాబ్స్.. ప్రతి ఒక్కరికి అవసరం.. చాలామంది అదే వేటలో ఉండి ఉంటారు.. అలాంటి వాళ్లకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగాల నోటిఫికేషన్స్‌లో ఎంత మాయ ఉందో.. ఎలాంటి గోల్ మాల్ జరుగుతుందో.. తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం.. ఉద్యోగాల కోసం జరిగే వెతుకులాటలో మనం ఎలా మోసాపోతున్నామో.. ఈ వీడియో చూసి తెలుసుకోండి.

నెలకు రూ.20 వేల జీతం.. వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇప్పుడే అప్లై చేసుకోండి... అనే ప్రకటన చూసి.. తొందరపడ్డారో.. మీరు పప్పులో కాలేసినట్టే. ఆ క్లాసిఫైడ్‌ చూసి అప్లై చేసుకున్నారో.. జేబులో డబ్బులు ఖాళీ అయినట్టే.. అలా ఉన్నాయి రోజులు.

మొబైల్.. నెట్ వంటి సదుపాయాలు పెరగడంతో సౌకర్యాలే కాదు.. మోసాలు పెరిగాయి. మన అవసరాలు, ఏమోషన్స్‌ను చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. ఆ అవకాశం కోసం కాచుకుని కూర్చుంటున్నారు. కొంచెం తొదరపడ్డామో.. ఆదమరిచామో.. బోలెడంత నష్టాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ పేరుతో కొంతమంది దొరికినంత దోచుకుంటున్నారు.

లాక్‌డౌన్, కరోనా కారణంగా చాలామంది ఉద్యోగాలు పోయాయి. దాంతో ఉద్యోగాల కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. దాంతో నెట్‌లో ఉద్యోగ ప్రకటనలు పెరిగాయి. మొబైల్ నెట్ ఆన్ చేయగానే.. ఇబ్బడి ముబ్బడిగా నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఉద్యోగం, మంచి జీతం అనే నోటిఫికేషన్స్ చూసి ఎవరైనా ఆశగా అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే అవే కొంప ముంచుతున్నాయి.

జాబ్ నోటిఫికేషన్స్‌ చూసి చాలామంది ఓపెన్ చేస్తారు. తీరా చూస్తే అక్కడ ఏ జాబ్ ఉండదు. కొన్నిటిపై క్లిక్ చేయగానే రీడైరక్టై వేరే ఏవో యాడ్స్ ఓపెన్ అవుతుంటాయి. ఆ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే చాలు.. అవతలి వారికి ఏదో రూపేణ లాభం ఉంటుంది. అందుకే అలాంటి ఫేక్ నోటిఫికేషన్లు ఇస్తారు. అక్కడితో ఆగితే పర్వాలేదు. కానీ కొన్ని ఓపెన్ చేసిన వెంటనే వివరాలిచ్చి అప్లికేషన్ ఫిల్ చేయమని, రెజ్యూమ్ అప్‌లోడ్ చేయమని అడుగుతాయి. కానీ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు చెల్లించాలని కొంత డబ్బును పే చేయాలని ఒక నోటీస్ ఉంటుంది. దాంతో జాబ్ కోసం చాలామంది ఫీజే కదా అనుకుని పే చేసేస్తారు. అలా అప్లై చేసిన తర్వాత రోజులు గడిచినా అవతల నుంచి మాత్రం రిప్లై రాదు. కొన్ని నెలలయ్యాక తెలుస్తుంది మోసాపోయారని.

మరికొన్ని నోటిఫికేషన్ల అయితే.. అప్లికేషన్ ఫీజు తీసుకుని మీ అప్లికేషన్‌ను పైకి ఫార్వార్డ్ చేస్తామని రిప్లై ఇస్తారు. కొన్ని రోజులయ్యాక ఫోన్ చేసి మీకు జాబ్ కావాలంటే.. ఇంకొంత డబ్బులు డిపాజిట్ కట్టాలని వేలల్లో కట్టించుకుంటున్నారు. జాబ్ వస్తే చాలులే అనుకుని అమాయకంగా ఆ డబ్బును కట్టేస్తున్నారు. ఇక జాబ్ వచ్చేసిందిలే సంతోషంగా ఉంటారు. తీరా చూస్తే.. తర్వాత ఆ ఫోన్ రాదు.. ఇవతల నుంచి ఫోన్ చేస్తే రిప్లై ఉండదు, ఆ నోటిఫికేషన్ కూడా కనిపించదు. ఈమధ్య కాలంలో ఎక్కువగా ఈ మోసాలే జరుగుతున్నాయి. ఉద్యోగాల కోసం అమాయకంగా మోసపోతున్నారు.

అందుకే జాబ్ నోటిఫికేషన్ చూడగానే దరఖాస్తు చేసేసుకోకుండా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోవాలి. తెలిసిన వాళ్లను అడిగి కన్ఫామ్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా నిజంగా ఉద్యోగాలకు తీసుకునేవాళ్లు డబ్బులు కట్టించుకోరు. అలా ఎవరైనా డబ్బులు పే చేయమని అడిగితే.. కచ్చితంగా అనుమానించాల్సిందే. అలాగే నోటిఫికేషన్ ఏ కంపెనీ నుంచి వచ్చింది, ఆ కంపెనీ ఉందా..? లేదా..? నోటిఫికేషన్ నిజమా..? కాదా అనేవి.. ఒకటికి నాలుగుసార్లు.. రూడీ చేసుకున్న తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

మీకు గాని, మీ ఫ్రెండ్స్‌కు కాని ఇలాంటి అనుభవాలున్నాయా..? ఇలాంటి నోటిఫికేషన్లు బారిన పడ్డారా..? అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి.

Other Related Local Jobs -
⭕ Postal Jobs Recruitment: https://www.youtube.com/playlist?list=PL4Q9UfP2U_5sJHnDqvBmNRlKZMloA4bLa

⭕ 10 th Pass Jobs: https://www.youtube.com/playlist?list=PL4Q9UfP2U_5v62BsvFMDhr_HdQVw2NJBd

⭕️ Latest Railway Jobs: https://www.youtube.com/playlist?list=PL4Q9UfP2U_5sqHO3XWRQyd8Gh6hj71B4Z

⭕ Latest Governmernt Jobs: https://www.youtube.com/playlist?list=PL4Q9UfP2U_5uaGebdcLlynbCokOQAn2Y3

⭕ Latest Grama Sachivalayam News: https://www.youtube.com/playlist?list=PL4Q9UfP2U_5tXLdi1HlhV-bpKAvxOz7gx

⭕ Latest Work From Home Jobs: https://www.youtube.com/playlist?list=PL4Q9UfP2U_5t8MFpnDs4P-j6nUkObtjQO

⭕ Small Business Ideas that you can start: https://www.youtube.com/playlist?list=PL4Q9UfP2U_5sAMrcyTaA810ynwsqTvuWH

#lokaljobs #freejobalert2021 #freejobalertinap2021 #freejobalertintelangana2021

Stay tuned on-
► Facebook: https://www.facebook.com/Lokal-App-Jo...
► Instagram: https://www.instagram.com/lokal.tips/
► Youtube: https://bit.ly/36gAgaz
► Website: https://telugu.getlokalapp.com/
► Telegram - https://t.me/lokaljobs

*********************************************

Related Queries -
1. lokal jobs

Видео ఎవరికీ డబ్బులు కట్టకండి ..! ఫేక్ జాబ్స్, ఫేక్ యాడ్స్ | Online Scam..! Fraud Alert..! Fake Jobs канала Lokal Jobs
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
14 июня 2021 г. 6:30:12
00:04:11
Другие видео канала
Free distribution of vegetables #free #vegetables #pedapalli #telugu #news #lokalFree distribution of vegetables #free #vegetables #pedapalli #telugu #news #lokalLatest Jobs Alerts, Lokal Jobs 15-03-2021 #shortsLatest Jobs Alerts, Lokal Jobs 15-03-2021 #shortsTelangana Group 1 | తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్Telangana Group 1 | తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్గ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | UPSC Recruitment 2021 in Telugu, Govt Jobగ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | UPSC Recruitment 2021 in Telugu, Govt Jobరణపాల మొక్కతో 150 వ్యాధులు దూరం నిపుణులు #healthtips #healthylifestyle #telugu #newsరణపాల మొక్కతో 150 వ్యాధులు దూరం నిపుణులు #healthtips #healthylifestyle #telugu #newsDCCB karimnagar | కరీంనగర్ డీసీసీబీలో ఉద్యోగాలుDCCB karimnagar | కరీంనగర్ డీసీసీబీలో ఉద్యోగాలుCME పుణెలో 119 గ్రూప్ - సీ ప్రభుత్వ ఉద్యోగాలు || చివరి తేది: మార్చి 04, 2023CME పుణెలో 119 గ్రూప్ - సీ ప్రభుత్వ ఉద్యోగాలు || చివరి తేది: మార్చి 04, 2023Fri Hecric Day Thoughts🙃Fri Hecric Day Thoughts🙃గ్రాడ్యుయేషన్తో ఐసీమ్మార్ ఎన్ఐఎంఆర్లో ఉద్యోగాలు |రూ.35,000 జీతం| ICMR NIMR Recruitment 2021,Govt Jobగ్రాడ్యుయేషన్తో ఐసీమ్మార్ ఎన్ఐఎంఆర్లో ఉద్యోగాలు |రూ.35,000 జీతం| ICMR NIMR Recruitment 2021,Govt Jobఇంటర్, గ్రాడ్యుయేషన్ తో జియో కస్టమర్ సర్వీస్ లోఉద్యోగాలు | JIO Recruitment 2022 in Telugu, JIO Jobsఇంటర్, గ్రాడ్యుయేషన్ తో జియో కస్టమర్ సర్వీస్ లోఉద్యోగాలు | JIO Recruitment 2022 in Telugu, JIO Jobs10th,ఇంటర్తో ఎన్ఐఏ‌బీలో ఉద్యోగాలు | నెలకు రూ.42,000 జీతం | NIAB Recruitment 2021 in Telugu, Govt Job10th,ఇంటర్తో ఎన్ఐఏ‌బీలో ఉద్యోగాలు | నెలకు రూ.42,000 జీతం | NIAB Recruitment 2021 in Telugu, Govt Job10th,ఇంటర్తో సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ 539పోస్టులు| Central Coalfields Recruitment 2021,Govt Job10th,ఇంటర్తో సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ 539పోస్టులు| Central Coalfields Recruitment 2021,Govt JobLatest Jobs Alerts, Lokal Jobs 03-04-2021 #shortsLatest Jobs Alerts, Lokal Jobs 03-04-2021 #shortsLatest Jobs Alerts, Lokal Jobs 12-04-2021 #shortsLatest Jobs Alerts, Lokal Jobs 12-04-2021 #shortsడిప్లమాతో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 316 ఉద్యోగాలు| WCL Recruitment 2021 in Telugu,Govt Jobడిప్లమాతో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 316 ఉద్యోగాలు| WCL Recruitment 2021 in Telugu,Govt JobGuntur Job Opportunity Don't miss Apply link in BioGuntur Job Opportunity Don't miss Apply link in Bioహకిన్స్ కుక్కర్ లిమిటెడ్లో ఉద్యోగాలు | శాలరీ ప్యాకేజీ 12లక్షలు | Hawkins Recruitment 2021,Latest Jobహకిన్స్ కుక్కర్ లిమిటెడ్లో ఉద్యోగాలు | శాలరీ ప్యాకేజీ 12లక్షలు | Hawkins Recruitment 2021,Latest Jobఇంటర్,ఐటీఐతో రైల్వే లో ఉద్యోగాలు | South Central Railway Recruitment 2021 in Telugu, Govt Jobఇంటర్,ఐటీఐతో రైల్వే లో ఉద్యోగాలు | South Central Railway Recruitment 2021 in Telugu, Govt Jobఐటీఐ,ఇంజనీరింగ్‌‌తో ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు | OIL India Limited Recruitment 2021,Govt Jobఐటీఐ,ఇంజనీరింగ్‌‌తో ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు | OIL India Limited Recruitment 2021,Govt JobLatest Jobs Alerts, Lokal Jobs 26-05-2021 #shortsLatest Jobs Alerts, Lokal Jobs 26-05-2021 #shorts
Яндекс.Метрика