Загрузка страницы

Meddalekki Ninnu Joochi | Annamayya Keerthana - 4

మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడ
వాడుదేరి వుస్సురందురా - వెంకటేశ
యాడనుంటివిందాఁకానురా ||

పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీవుంగరము
గక్కన నేనద్దుకొందురా - వెంకటేశ
లక్కవలె ముద్రలంటెరా ||

దప్పిగొంటివని నీకుఁ - గప్పురముపారమిచ్చి
ముప్పిరి నీ విరహానను - వెంకటేశ
నిప్పనుచు భ్రమసితిరా ||

బొండుమల్లెపానుపుపై - నుండి నిన్నుఁ బాడి పాడి
నిండుజాగరములుంటిరా - వెంకటేశ
యెండలాయ వెన్నెలలు రా ||

పట్టుచీరకొంగు జారి - గుట్టుతో నేనుండఁగాను
వట్టినవ్వులేల నవ్వేవు - వెంకటేశ
దిట్టవు నీయంతవారమా ||

వున్నతి శ్రీ వెంకటేశ - మన్నించి కూడితివిదే
నన్ను నెంత మెచ్చు మెచ్చేవు - వెంకటేశ
కన్నులపండువలాయరా ||

Видео Meddalekki Ninnu Joochi | Annamayya Keerthana - 4 канала Lasya Studio
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
23 апреля 2023 г. 11:16:41
00:03:45
Яндекс.Метрика