Загрузка...

మౌంట్ లిటేరా జి స్కూల్' నిర్మాణానికి భూమి పూజ చేసిన కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని. #pemmasani

#pemmasaniforguntur #pemmasanichandrashekar #pemmasani
మౌంట్ లిటేరా జి స్కూల్' నిర్మాణానికి భూమి పూజ చేసిన కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని

అంతర్జాతీయ ప్రమాణాలతో మాదల చైతన్య,మీనా రత్న ఆధ్వర్యంలో మాదల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా మౌంట్ లిటేరా జి స్కూల్ గుంటూరులో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం గుంటూరు పలకలూరు రోడ్డు ఎల్ఐసి కాలనీ నందు మాదల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రమాణాలతో నెలకొల్పనున్న మౌంట్ లిటేరా జి స్కూలు నిర్మాణానికి కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిధిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు పట్టణం ఎడ్యుకేషనల్ హబ్ గా కానున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించే దిశగా మాదల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు మాదల చైతన్య, మాదల మీనారత్న 'మౌంట్ లిటేరా జి స్కూలు' ఏర్పాటు చేయాలనుకోవడం హర్షనీయమన్నారు. చదువు అంటే కేలం ర్యాంకులే ప్రామాణికంగా కాకుండా క్రీడలు, విజ్ఞాన సముపార్జనే దిశగా కొనసాగించేలా ఉండాలన్నారు. భావితరాల భవిష్యత్తు విద్యుత్ పైనే ఆధారపడి ఉంటుందన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలు, భాషను గుర్తుంచుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సింది విద్యా సంస్థలే అన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన మన సాంప్రదాయేతర మూలాలను మరచిపోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రథమ పౌరులు, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని), ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నసీర్ అహ్మద్,నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్,వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. @apreport

Видео మౌంట్ లిటేరా జి స్కూల్' నిర్మాణానికి భూమి పూజ చేసిన కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని. #pemmasani канала AP REPORT
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки

На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.

О CookiesНапомнить позжеПринять