Загрузка...

ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్లకు తెలీని విషయం ఇక్కడొకటి ఉంది. అదేంటంటే... #friends #colleagues

ప్లాట్ కొనేముందు స్నేహితులు, కొలీగ్స్ సలహా తీసుకోవచ్చా?
ప్లాట్ కొనేముందు స్నేహితులు, కొలీగ్స్ సలహా తీసుకోవాలి అనుకుంటున్నవారి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం.
మొదటిగా స్నేహితులు: స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వితం అంటూ పాడుకునే స్నేహంమీద నమ్మకం ఎప్పుడూ ఉంటుంది. పుస్తకాన్ని కూడా స్నేహితుడితో పోల్చారు. ఎందుకంటే స్నేహితుడు తోడుంటే దేన్నైనా సాధించవచ్చు అని. అలాంటి స్నేహితులు ఈ లోకంలో చాలామందికి ఉన్నారు. వాళ్ళంతా అదృష్టవంతులు. అయితే ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలే అనే విషయాన్ని చెప్పాడో సినీకవి. ఆయన చెప్పినట్లుగానే రోజూ పేపర్లలో, టీవీలల్లో డబ్బు కోసం ఎంతదూరమైనా వెళ్తోన్న సంగతులు బయటకొస్తున్నాయి.
ఇదంతా ఎందుకంటే, మంచి స్నేహితుడు లేకపోతే మన గమనం కూడా అడ్డదిడ్డంగా ఉంటుంది. ఆ మంచి స్నేహితుడే ఆర్ధిక బంధాలకు తలోంచితే మనం ఆర్థికంగా చిక్కుల్లో పడతాం. అంటే స్నేహితుడికి ఏదన్నా ఆర్ధిక ఇబ్బంది ఉందనుకొండి, మన దగ్గరున్న డబ్బుల సంగతి తెలిస్తే అప్పుగా సాయం చేయమని అడుగుతాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తిరిగిచ్చేస్తాను అంటాడు. ఇవ్వకుండా ఉండలేం. ఇచ్చాకా, డబ్బులు తిరిగిరాక నానా అవస్థులు పడుతున్న వారు ఎందరో.. ఇంకో రకమైన స్నేహితుల గురించి మాట్లాడుకుందాం,
ఈశాన్య హైట్స్ ప్రాజెక్ట్ ను చూడడానికి కొంతమంది కస్టమర్స్ వాళ్ళ స్నేహితుల్ని తీసుకొచ్చారు. ఎవరైతే ప్లాట్ కొందామనుకుంటున్నారో, వాళ్ళు కాకుండా తోడు వచ్చిన మిత్రులే విషయాలన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. అసలు వ్యక్తి మౌనంగా చూస్తూ ఉన్నాడు. తన స్నేహితుడు ఎలాగంటే అలాగేనని కొనకుండా వెళ్ళిపోయారు. తరచి చూస్తే ఐదారు నెలలు తర్వాత ఆ స్నేహితుడిని తీసుకురాకుండా, భార్యను వెంటేసుకుని వచ్చిన ఆ కస్టమర్స్ ప్లాట్స్ కొనుక్కున్నారు. ఏమైందని అడిగితే ‘వేరేవి కూడా చూద్దాం, తొందర పడొద్దు అని చెప్పి కొన్ని ప్రాజెక్ట్స్ చూపించాడు. లిగాలిటీస్ సరిగ్గా లేవు, బాగున్నవి లొకేషన్ నచ్చలేదు, లొకేషన్ నచ్చితే price అందుబాటులో లేదు, ఏంటిది అని అడిగితే నీకు నచ్చిన చోటే తీసుకో అన్నాడు’ అంటూ చాలా కారణాలు చెప్పారు. దీన్ని బట్టి సూక్ష్మాన్ని అర్థం చేసుకోండి. ప్లాట్ కొనేది మీరు, అతను కాదు... ఇలా స్నేహితుల వలన, లేదా సైట్ చూడడానికి మనతో వచ్చిన వాళ్ళు సరిగ్గా గైడ్ చేయకపోతే ఎలా ఉంటుందో సెలబ్రిటీల విషయంలో చాలాసార్లు జరిగింది. చాలా ఫంక్షన్స్ లో వాళ్ళు చెప్పుకున్నారు కూడా.. కావాలంటే మచ్చుకు ఈ క్లిప్స్ చూడండి...
రెండొవది కొలీగ్స్: ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో కొలీగ్స్ తో ఎటువంటి విషయాలు పంచుకోవాలో తేల్చుకోలేని దుస్థితి ఏర్పడింది. ఒకవేళ మన కొలీగ్స్ మనకు సహకరించేవారుంటే చాలా సంతోషం! అట్లాగని అన్ని విషయాల్లో సహకరిస్తారా! అదీనూ డబ్బు విషయంలో.. డబ్బు అందరి ఆలోచనల్ని తారుమారు చేసే మాయలమారి కదా.. మన కొలీగ్ దగ్గర ముప్పై లక్షల రూపాయలు సేవింగ్స్ ఉన్నాయంటే మనకు ఎలా అనిపిస్తుంది? అతను ప్లాట్ కొంటున్నాడు అంటే ఎలా ఆలోచిస్తాం.? అన్నీ నెగిటివ్ విషయాలే మాట్లాడుతున్నాను అనిపించొచ్చు... డబ్బు దగ్గరికొచ్చేసరికి మనిషి మనసు ఇలాగే ఉంటుంది మరి.
ఉదాహారణకు మనం ప్లాట్ కొందామనుకున్న విషయం మన కొలీగ్ కి చెప్పామే అనుకుందాం, అతను ఒకవేళ ప్లాట్ కొని ఉంటే అదే లేఔట్ లో కొనుక్కోమని సలహా ఇస్తాడు, అక్కడవరకు బాగుంది. సమయాభావం వలన అక్కడా ప్లాట్ అదే ధరకు దొరుకుతుందా? అక్కడ అవైలబిలిటి ఎలా ఉంటుందో చెప్పగలమా? ఇంతాచేసి మనం ప్లాట్ కొంటే, ఆ విషయం ఎంతమందికి చెప్తాడో.. అది ఎటువంటి వారి నుంచి ఎటువంటి వారికి చేరుతుందో... ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, చాలామంది కస్టమర్స్ తాము ప్లాట్ కొనుక్కున్న విషయాన్ని నలుగురికి చెప్పాలనుకోరు... గోప్యంగా ఉంచడానికే ప్రయత్నిస్తారు. అది ప్రత్యక్షంగా మాకు తెలుసు. రిజిస్ట్రేషన్ అయ్యాక వాళ్ళ అభిప్రాయాన్నీ రాయమని అడిగినా చాలామంది నిరాకరిస్తారు. కాబట్టి ఎవరితో ఎటువంటి విషయాలు షేర్ చేసుకోవాలి అనేది విజ్ఞతతో ఆలోచించుకోవాలి.

Follow us on -
Instagram: https://www.instagram.com/eeshanya_infra/
Facebook: https://www.facebook.com/eeshanyagroup/
Twitter (X): https://twitter.com/Eeshanya_Infraa
YouTube: https://www.youtube.com/@UCQ8-LXGR3PL-4ARzioyOspA

-:: Related Videos ::-
01. ఇది చాలామంది చేసే తప్పే! మీరూ ఇలాగే చేస్తుంటే ఏం చేయాలో చూడండి! జాగ్రత్త వహించండి!!
https://youtu.be/T_2OC2A-Mj8

02. ప్రభుత్వం కొత్తగా పెంచిన HMDA పరిధి గురించి మరిన్నిని వివరాలకు వీడియో మొత్తం చూడండి!
https://youtu.be/xxe90z5rTps

03. కేంద్ర ప్రభుత్వం అందించిన తీపి కబురు | ఈ హైవేకి మరో మణిహారం వచ్చి చేరబోతోంది.
https://youtu.be/mX-GvI_8XD8

04. గ్లోబల్ సర్వేలన్నీ నిగ్గు తేల్చుతున్నాయి. అసలు కారణాలు బయటపడ్డాయి.
https://youtu.be/T_x46zriFx8

05. అభివృద్ధి కార్యక్రమాలతో తారాపథంలో దూసుకుపోతోన్న తెలంగాణా ప్రభుత్వం | కీలకమైన ప్రాజెక్ట్స్ ముందడుగు..
https://youtu.be/p4quUhpvObs

📌 Hashtags:-
#RealEstate #OpenPlots #LandInvestment #PropertyBuying #RealEstateTips #Investment #LandBuyingTips #SmartInvesting #RealEstatehyderabad#PropertyTips #BuyLand #PlotForSale #InvestSmart #HouseBuying #RealEstateMarket #FirstTimeBuyer #HomeBuyingTips #PropertyAdvice #LandDevelopment #CommercialRealEstate #FutureInvestment #RealEstateGuide #BuyingAHome #LandOwnership #ShadnagarPlots #ShadnagarVillas #ShadnagarOpenPlots #EeshanyaInfra #openplotsinhyderabad,#PropertySearch #RealEstateOpportunities, #FinancialFreedom #HouseForSale #BuyNow #realestateindustry

Видео ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్లకు తెలీని విషయం ఇక్కడొకటి ఉంది. అదేంటంటే... #friends #colleagues канала Eeshanya Infraa
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки