Загрузка страницы

Sai Gurukulam Episode 676 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitv

Sai Gurukulam Episode 676 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitv

కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుడనారాధించువాడు. విగ్రహారాధనమున కాతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైన తెలిసికొనుటకు షిరిడీకి పోవనంగీకరించెను. కాని, బాబాకు నమస్కరించననియు, వారికి దక్షిణ యివ్వననియు చెప్పెను. కాకా యీ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారమునాడు రాత్రి బొంబాయి విడిచి యా మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగనే కొంచెము దూరమున నున్న బాబా, మహాజని స్నేహితుని మంచిమాటలతో నాహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠమువలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి దెచ్చెను. శరీరము సంతోషముతో నుప్పొంగెను. కంఠపు ఆకర్షణశక్తి యేమని చెప్పుదును? మిగుల నాశ్చర్యపడి యా స్నేహితుడు " ఇది తప్పనిసరిగా మా తండ్రికంఠమే" యనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి, తన మనోనిశ్చయమును మరచినవాడై, బాబా పాదములకు నమస్కరించెను.

ఉదయ మొకసారి మధ్యాహ్న మొకసారి బాబా దక్షిణ యడుగగా కాకా మహాజని యిచ్చెను. బాబా కాకానే దక్షిణ యడుగు చుండెను. కాని యతని స్నేహితుని అడుగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో "బాబా నిన్నే రెండుసారులు దక్షిణ యడిగెను. నేను నీతో నున్నాను. నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు?" అని యడిగెను. "నీవే బాబాను అడుగుము" యని యతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజని నడుగగా, తన స్నేహితుడు తానుకూడ దక్షిణ యివ్వవచ్చునా యని బాబాను అడిగెను. బాబా "నీ కిచ్చుటకు మనమున నిష్టము లేకుండెను. కాన నిన్నడుగలేదు. కాని, యిప్పుడు నీ కిష్టమున్న యెడల ఇవ్వవచ్చు" ననెను. కాకా యిచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణము అతని స్నేహితుడు కూడనిచ్చెను. బాబా యపుడు కొన్ని మాటలు సలహారూపముగా నిట్లు చెప్పెను. "నీవు దానిని తీసివేయుము; మనకు మధ్య నున్న యడ్డును తీసివేయుము. అప్పుడు మన మొకరినొకరు ముఖాముఖి చూచు కొనగలము; కలిసికొనగలము." పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికి వర్షము వచ్చునేమోయను భయము కలుగుచున్నప్పటికి ప్రయాస లేకుండ ప్రయాణము సాగునని బాబా యాశీర్వదించెను. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికిపోయి తలుపు తీయుసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడియుండెను. ఇంకొకటి కిటికీద్వారా యెగిరిపోయెను. వారి యదృష్టానుసారముగ నవి చచ్చెను. మూడవదానిని రక్షించుటకై బాబా త్వరగా తనను బంపె ననుకొనెను.

Видео Sai Gurukulam Episode 676 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitv канала SAI TV Live Telugu
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
11 января 2022 г. 18:30:03
00:11:33
Другие видео канала
శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06SATSANGAM EP 44 // వరాల సాయి మందిరం లో  శ్రీ సాయిసత్సంగం అద్వితీయమైన సాయి లీలల సమాహారంSATSANGAM EP 44 // వరాల సాయి మందిరం లో శ్రీ సాయిసత్సంగం అద్వితీయమైన సాయి లీలల సమాహారంశిరిడిలో అంగరంగ వైభవంగా శ్రీ రామనవమి ఉత్సవాలు చూస్తే కన్నులపండుగశిరిడిలో అంగరంగ వైభవంగా శ్రీ రామనవమి ఉత్సవాలు చూస్తే కన్నులపండుగSai Gurukulam Episode 742 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 742 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 807 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 807 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 722 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 722 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvసాయి భక్తిసాగరం EP 37సాయి భక్తిసాగరం EP 37Sai Gurukulam Episode 1024 II Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 1024 II Speeches on Satcharitra #anilkumar II saitvశ్రీ రామ విజయం 4వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 04శ్రీ రామ విజయం 4వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 04// Sai Gurukulam  episode1228// Sai Gurukulam episode1228కాకడా హరతిలో బాబాకు వెన్న ప్రసాదం ఎందుకు పెడుతారు. // SATSANGAM EP 71కాకడా హరతిలో బాబాకు వెన్న ప్రసాదం ఎందుకు పెడుతారు. // SATSANGAM EP 71శ్రీ సాయి సచ్చరిత తెలుగులోకి ఎలా అనువదించబడింది.? దానికి అంత మహత్తు పెరగడానికి గల కారణమేంటి?శ్రీ సాయి సచ్చరిత తెలుగులోకి ఎలా అనువదించబడింది.? దానికి అంత మహత్తు పెరగడానికి గల కారణమేంటి?Sai Gurukulam Episode1296 // భక్తుడి యోగక్షేమాలు బాబా కనిపెట్టుకొని ఉండడానికి గల కారణమేంటో తెలుసా?Sai Gurukulam Episode1296 // భక్తుడి యోగక్షేమాలు బాబా కనిపెట్టుకొని ఉండడానికి గల కారణమేంటో తెలుసా?బాబా శాలువా అమ్మి అన్నార్తులను ఆదుకున్న భక్తుడు పొందిన అనుగ్రహం//Sai Gurukulam  episode1235బాబా శాలువా అమ్మి అన్నార్తులను ఆదుకున్న భక్తుడు పొందిన అనుగ్రహం//Sai Gurukulam episode1235గురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమోగురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమోSai Gurukulam Episode 985 II PA 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 985 II PA 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 563 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 563 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?Sai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?Sai Gurukulam Episode 542 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 542 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 867 II  Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 867 II Speeches of saibaba #anilkumar II saitvSATSANGAM EPISODE 88 //వేషం కట్టినవారు బాబా ప్రతినిధులవుతారా?SATSANGAM EPISODE 88 //వేషం కట్టినవారు బాబా ప్రతినిధులవుతారా?
Яндекс.Метрика