Загрузка страницы

Manidweepa varnana 9 times in telugu || నూతన గృహము కొరకు మణిద్వీప వర్ణన 9 సార్లు విని నా చాలు శుభమే

📌Manidweepa varnana in Telugu with lyrics
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సుల లో కొలువై ఉంది || 1 ||

సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు || 2 ||

లక్షల లక్షల లావన్యాలు అక్షర లక్షల వాక్సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు || 3||

పారిజత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు || 4 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు
మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు || 5 ||

అరువది నాలుగు కళామతల్లులు వరలనోసగే పదారుశక్తులు
పరివారముతో పంచ బ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 6 ||

అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తల సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు || 7 ||

కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు || 8 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు
ఏడామడల రత్న రాశులు మణిద్వీపానికి మహానిధులు || 9 ||

పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాదిపతులు మణిద్వీపానికి మహానిధులు || 10 ||

ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటల వైడూర్య
పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు || 11 ||

సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వ శుభప్రధ ఇచ్చాశక్తలు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 12 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

మిలమిలలాడే ముత్యపు రాశులు తలతలలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు || 13 ||

కుబేర ఇంద్రవరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు || 14 ||

భక్తి జ్ఞాన వైరాగ్యసిద్ధులు పంచభూతములు పంచాశక్తులు
సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు || 15 ||

కస్తూరి మల్లిక కుందవనాలు సూర్య కాంతి శిలమహాగ్రహాలు
ఆరుఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు || 16 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

మంత్రిని దండినీ శక్తి సేనలు కాళీ కరాళి సేనాపతులు
ముప్పదిరెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 17 ||

సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవీ పరిచారికలు
గోమేదికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు || 18 ||

సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు || 19 ||

మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయకారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు || 20 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మ శక్తులు మణిద్వీపానికి మహానిధులు || 21 ||

దివ్యఫలములు దివ్యాస్త్రములు దివ్యపురుషులు ధీరమాతలు
దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 22 ||

శ్రీ విగ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు || 23 ||

పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు మణిద్వీపానికి మహానిధులు || 24 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాశులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు || 25 ||

దుఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు || 26 ||

పదనాల్గు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మనిద్వీపం సర్వేశ్వరీకది శాశ్వతస్థానం || 27 ||

చింతామణుల మందిరమందు పంచాబ్రహ్మలు మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరీ తో నివసిస్తాడు మనిద్వీపము లో || 28 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మనిద్వీపము లో || 29 ||

పరదేవతను నిత్యము కొలిచిమనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలు ఇచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది || 30 || (2)

నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు || 31 || (2)

శివకవితేస్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట
తిష్టవేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం || 32 ||
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Disclaimer: Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
NOTE:- ALL THE IMAGES/AUDIO SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTIVE OWNERS AND NOT To ME. I AM NOT THE OWNER OF ANY PICTURES/AUDIO SHOWN IN THE VIDEOS. THIS VIDEO IS ONLY FOR EDUCATION PURPOSES ONLY.
This does not support any illegal activities these videos are only for video logs and Entertainment and giving Updates purpose please share this with your people and like and comment.

Видео Manidweepa varnana 9 times in telugu || నూతన గృహము కొరకు మణిద్వీప వర్ణన 9 సార్లు విని నా చాలు శుభమే канала Sri Devotional
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
28 мая 2021 г. 6:26:40
01:54:23
Другие видео канала
మనసులోని కోరికలు తీరాలంటే ఈ కథ వినండి chaganti koteswara rao speeches pravachanam latest 2021మనసులోని కోరికలు తీరాలంటే ఈ కథ వినండి chaganti koteswara rao speeches pravachanam latest 2021మణిద్వీప వర్ణన  9 సార్లు విని చూడండి మీకే మార్పు తెలుస్తుంది - Manidweepa Varnana Stotramమణిద్వీప వర్ణన 9 సార్లు విని చూడండి మీకే మార్పు తెలుస్తుంది - Manidweepa Varnana StotramLalitha Sahasranamam  | TeluguLalitha Sahasranamam | Teluguశ్రావణమాసంలో ఈ ఒక్క కథ వినండి చాలు నీ దశ తిరిగినట్లే | chaganti latest speeches 2021 | sri chagantiశ్రావణమాసంలో ఈ ఒక్క కథ వినండి చాలు నీ దశ తిరిగినట్లే | chaganti latest speeches 2021 | sri chagantiSri Lalitha Sahasranama Stotram | Thousand Names of Goddess Lalita | MS Subbalaxmi Jr | BhakthiOneSri Lalitha Sahasranama Stotram | Thousand Names of Goddess Lalita | MS Subbalaxmi Jr | BhakthiOneశ్రావణ శుక్రవారం - కనకధారా స్తోత్రం వింటే మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది | Kanakadhara Stotramశ్రావణ శుక్రవారం - కనకధారా స్తోత్రం వింటే మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది | Kanakadhara Stotramగాయత్రి మంత్రం  ఓం భూర్బువస్సువః Gayatri Mantra By Smt Vani Jayaram || Om Bhur Bhuva Swah...గాయత్రి మంత్రం ఓం భూర్బువస్సువః Gayatri Mantra By Smt Vani Jayaram || Om Bhur Bhuva Swah...లింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది||Shiva Lingashatakam-Devotional Timeలింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది||Shiva Lingashatakam-Devotional Timeగురువారం రోజు తప్పకుండా వినాల్సిన పాటలు | Sai Baba Songs Live | Bhakthi Liveగురువారం రోజు తప్పకుండా వినాల్సిన పాటలు | Sai Baba Songs Live | Bhakthi Liveమణిద్వీప వర్ణన తెలుగు|MANIDWEEPA VARNANA|TELUGU, KANNADA & ENGLISH LYRICS |BHAKTI |SRIVANI GORANTLAమణిద్వీప వర్ణన తెలుగు|MANIDWEEPA VARNANA|TELUGU, KANNADA & ENGLISH LYRICS |BHAKTI |SRIVANI GORANTLAM.S.Rama Rao sundarakanda part 1 telugu lyricsM.S.Rama Rao sundarakanda part 1 telugu lyricsపూజ చేసే సమయంలో కన్నీళ్లు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచనలు, వస్తే..! Pooja Vidhanamపూజ చేసే సమయంలో కన్నీళ్లు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచనలు, వస్తే..! Pooja VidhanamKanakadhara Stotram With Telugu Lyrics And MeaningsKanakadhara Stotram With Telugu Lyrics And MeaningsAigiri Nandini With Telugu Lyrics | Mahishasura Mardini | Durga Devi Stotram - Telugu TraditionsAigiri Nandini With Telugu Lyrics | Mahishasura Mardini | Durga Devi Stotram - Telugu TraditionsSRI DEVI KHADGAMALA STOTRAM | Popular Devotional Stotras | BHAKTI | Raghava ReddySRI DEVI KHADGAMALA STOTRAM | Popular Devotional Stotras | BHAKTI | Raghava ReddyVishnu SahasranamamVishnu SahasranamamLalitha Sahasranamam Full By MS SubbalakshmiLalitha Sahasranamam Full By MS SubbalakshmiVishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICSVishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICSManidweepa Varnana 9 Times in Telugu | మణిద్వీప వర్ణన 9 సార్లుManidweepa Varnana 9 Times in Telugu | మణిద్వీప వర్ణన 9 సార్లు
Яндекс.Метрика