Загрузка...

ప్రణవ సామ లక్ష్మారెడ్డి 'గ్రీన్విచ్' విల్లాస్ లో గండబేరుండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హోమంరాజేంద్రనగ

రంగారెడ్డి జిల్లా...
ప్రణవ సామ లక్ష్మారెడ్డి 'గ్రీన్విచ్' విల్లాస్ లో గండబేరుండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హోమం

రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ లోని ప్రణవ సామ లక్ష్మా రెడ్డి 'గ్రీన్విచ్' విల్లాస్ లో గండబేరుండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర యాగంతో ఆ ప్రదేశం ఆధ్యాత్మికను సంతరించుకుంది. వేద మంత్రోచ్చారణతో ఆ ప్రదేశం మార్మోగిపోయింది. ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రంలా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ హోమానికి హాజరైన భక్తులు, గృహ యజమానులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. ఈ మహా హోమంలో సంపద, సుఖశాంతులు, విజయం ప్రసాదించమని లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థించారు. ఈ హోమం ప్రాజెక్ట్ అత్యుత్తమ నాణ్యతకు, నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది.

ఈ సందర్భంగా ప్రణవ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు బూరుగు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన నివాస సముదాయాన్ని రూపొందించడం మా లక్ష్యమన్నారు. ఇది విలాసం, సౌకర్యం, స్థిరమైన జీవన విధానానికి నిదర్శనంగా నిలవనుందన్నారు. ఈ హోమం మా నివాసులకు ప్రపంచ స్థాయి జీవన అనుభవాన్ని అందించే దిశగా మా ప్రయాణాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో, విస్తృత జీవన శైలి సౌకర్యాలతో ఆధునిక విల్లా జీవనాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లేలా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ అందమైన, సౌలభ్యంతో కూడిన జీవనశైలిని కోరుకునే గృహ కొనుగోలుదారులలో ఆసక్తిని మరింత పెంచనుందని తెలిపారు.

ప్రణవ సామ లక్ష్మా రెడ్డి విల్లా ప్రాజెక్ట్ ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఇది ప్రశాంతతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఆధునిక జీవనశైలిని ప్రతిబింబిస్తూ.. ఈ ప్రాజెక్ట్ క్లబ్ హౌస్, తోటలు, స్విమ్మింగ్ పూల్, క్రీడా సౌకర్యాలు, ఆరోగ్య, వినోద కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాలు కలవన్నారు. ప్రపంచస్థాయి సౌకర్యాలు ఉన్నాయన్నారు. సమకాలీన అవసరాలతో పాటు ప్రకృతి అనుకూలమైన ప్రశాంత వాతావరణాన్ని పరిరక్షించడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణవ గ్రూప్ చైర్మన్ రవి కుమార్ బూరుగు, ప్రణవ గ్రూప్ డైరెక్టర్ అశోక్ బండారు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు....

Видео ప్రణవ సామ లక్ష్మారెడ్డి 'గ్రీన్విచ్' విల్లాస్ లో గండబేరుండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హోమంరాజేంద్రనగ канала Tv 1 NEWS
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки